సిటీబ్యూరో, మే 25,(నమస్తే తెలంగాణ): మెడికోలకు ఇవ్వాల్సిన ైస్టెపెండ్ను ఇవ్వకుండా.. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో చేసిన జీవో ప్రకారమే ఇస్తూ వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయి. 2023లో బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన జీవోను ఏ మాత్రం అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యశాఖమంత్రికి మొరపెట్టుకున్నా కూడా సత్వర ఫలితం శూన్యంగానే మిగిలింది.
2023లో జీవో ప్రకారం ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సుమారు 1000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఐదున్నరేండ్ల ఎంబీబీఎస్ కోర్సులో భాగంగా, నాలుగున్నరేండ్లు పాఠాలు పూర్తిచేసుకొని ప్రస్తుతం సంబంధిత మెడికల్ కళాశాలకు చెందిన ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఏడాదిపాటు చేసే ఈ ఇంటర్న్‌షిప్‌లో సంబంధిత మెడికల్ కళాశాల యాజమాన్యమే వారికి ప్రతినెలా ైస్టెపెండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2003లో అమలు చేసిన జీవో ప్రకారం ప్రతినెల రూ. 2000 ైస్టెపెండ్ ఇస్తుండేవారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లో ప్రతినెలా మెడికోలకు రూ. 2,5609 ఇవ్వాలని అదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలన్నీ కూడా ఈ జీవోను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అమలు చేస్తుండగా, ప్రైవేట్‌లో మాత్రం 2003 ప్రకారమే ైస్టెపెండ్ చెల్లిస్తుండటం గమనార్హం. కారణాలు చెప్పకుండా విద్యార్థుల చేత ఏడాదంతా ఇంటర్న్‌షిప్ పేరుతో సేవ చేయించుకొని చాలీచాలని ైస్టెఫండ్ ఇస్తున్నారు.
ఇచ్చేదాంటో ్ల కూడా కోతలు..
ఎన్ఎంసీ నియమాలను తుంగలో తొక్కడమే కాకుండా విద్యార్థులను సైతం ైస్టెపెండ్ విషయంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీవ్ర మోసం చేస్తున్నాయి. విద్యార్థులందరికీ ఒకే బ్యాంక్‌లో ఖాతాలు తెరిపించి, బ్లాంక్ చెక్ మీద సంతకాలు తీసుకుంటున్నారు. పేరుకు మాత్రం రూ.25609 వేస్తున్నట్లు నటించి ైస్టెఫండ్ పడిన వెంటనే విద్యార్థుల ఖాతాల్లో రూ.2000 మిగిల్చి, మిగతాదంతా బ్లాంక్ చెక్కుల్లో రాసుకొని కళాశాల ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే ఆ రూ.2000