సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఉద్యోగి ఫోన్ నెంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌కు యాడ్ చేసిన సైబర్‌నేరగాళ్లు పార్ట్‌టైం ఉద్యోగం అంటూ రూ. 150 ఎరగా వేసి రూ. 16 లక్షలు కాజేశారు. ఉప్పల్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను సీఎంఈ టాస్క్ గ్రూప్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. మూడు గూగుల్ మ్యాప్స్‌కు సంబంధించిన రివ్యూస్ రాయాలంటూ సూచనలు చేసి, ఆ తరువాత రూ. 150 బ్యాంకు ఖాతాకు పంపించారు. ఆ తరువాత సీఎంఈ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో నెంబర్‌ను యాడ్ చేశారు.
అందులో ఒక లింక్ పంపించి పుల్ టైమ్, పార్ట్‌టైమ్ జాబ్స్ ఉన్నాయని అందులో గూగుల్ మ్యాప్స్ రివ్యూ రాస్తే సరిపోతుందంటూ సూచనలు చేశారు. ఒకో టాస్క్‌కు రూ. 50 ఇస్తారని, అదే పెట్టుబడి పెట్టి టాస్క్‌లు తీసుకుంటే మంచి లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ ఒక వెబ్సైట్లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో బాధితుడికి అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ నుంచి టాస్క్‌లతో ట్రేడింగ్ చేయాలంటూ సూచనలు చేశారు. దీంతో బాధితుడు దఫ దఫాలుగా రూ. 6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే స్క్రీన్‌పై పెట్టిన పెట్టుబడి, లాభాలు కలుపుకొని రూ. 29 లక్షలు కనిపించాయి.
అందులో నుంచి మొదట రూ. 10 వేలు డ్రా చేసుకున్నాడు, తరువాత లక్ష విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని, క్రెడిట్ స్కోర్ 80 శాతం పడిపోయిందంటూ సైబర్‌నేరగాళ్లు భయపెట్టారు. తిరిగి మీకు 100 క్రెడిట్ స్కోర్ కావాలంటే రూ. 10.36 లక్షలు డిపాజిట్ చేయాలని, దాంతో మీకు వీఐపీ యాక్సెస్ ఉంటుందంటూ నమ్మించారు. నిజమని నమ్మిన బాధితుడు ఆ మొత్తం డిపాజిట్ చేయడంతో స్క్రీన్‌పై రూ. 40 లక్షలు కన్పించాయి. విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.