Dana Kishore | సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): డెంగీ, మలేరియా, చికున్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ ఎంటమాలజీ, ఏఎంహెచ్ఓలు, తహశీల్దార్లు, అసిస్టెంట్ ఎంటమాజిస్టులు చేపట్టాల్సిన కార్యాచరణపై దాన కిశోర్ గురువారం దిశా నిర్దేశం చేశారు.
డెంగీ పాజిటివ్ కేసులన్నింటిని తనిఖీ చేయాలని, ప్రతిరోజు బస్తీ దవాఖానలను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని చెప్పారు. జోనల్ కమిషనర్లు డెంగీ మలేరియా చికున్ గున్యా, ఇతర వ్యాధులపై క్రమం తప్పకుండా డీసీలు, ఎస్ఈలు, ఏఈలతో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను సందర్శించి డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని దాన కిశోర్ సూచించారు. స్లమ్ ఏరియాలో పాజిటివ్ కేసులు గల ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, సీనియర్ ఎంటమాలజిస్టులు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ప్రతిరోజు ఐదు నుంచి ఆరు ప్రాంతాలను తప్పకుండా రీ చెక్ చేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీలో చేపట్టిన చర్యలు