సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజీగా మీరు కొన్న షేర్లపై రుణాలొస్తాయి, ఇప్పుడైతే మీరు డబ్బు ఎలాగైనా పెట్టి షేర్స్ కొనం డి, 50 శాతం డిస్కౌంట్ ప్రైజ్‌కు వస్తున్నాయంటూ మభ్య పెడుతున్నారు. అప్పటికే కొంత డబ్బు పెట్టి మధ్యలో ఆగిపోయిన బాధితుడు మరికొంత పెట్టుబడి పెడితే మొ త్తానికి లోన్ వస్తుందనే ఆశతోనూ మరికొన్ని అప్పులు తెచ్చి సైబర్‌నేరగాళ్ల ఖా తాల్లో పోసేస్తున్నారు.
ఇలా ట్రేడింగ్ మోసాలలో రోజు రోజుకు కొత్త పంథాలో మోసాలు చేస్తూ సైబర్‌నేరగాళ్లు బాధితుల వద్ద ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.ఇలా రూ.5లక్షలు దాటాయంటే బాధితుడు తమ చేతుల్లోకి వచ్చేశాడనే భావనతో సైబర్‌నేరగాళ్లు ఈ లోన్ ఆఫర్స్ ఇస్తున్నారు. అయితేలోన్ ముందే ఇవ్వాలంటే అలా కుదరదంటూ పేచి పెడుతూ ప్రాసెసింగ్ కోసం సమయం పడుతుం ది.. మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ అవుతుంది.ఈ రోజు వచ్చిన షేర్ ప్రైజ్ మీకు మళ్లి రాదు, మీరు ఈ షేర్స్ కొంటారంటేనేలోన్ అప్రూవ్ అవుతుందంటూ నానా రకాలుగా బాధితుడిని మభ్య పెడుతుంటారు. షేర్స్‌పై నిజమైన కంపెనీలు కూడా కొన్నిసార్లు రుణాలు ఇస్తుంటాయి. సైబర్‌నేరగాళ్లు ఈ విష యం చెప్పే వరకు నిజమని కొందరు నమ్మేస్తున్నారు.
సైబర్నేరాలలో ప్రస్తుతం ప్రధానంగా ట్రేడింగ్ మోసాలే మొదటి స్థానంలో ఉంటూ ప్రజలు ఎక్కువ శాతంలో నష్టపోతున్నారు. ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలొస్తాయని కొందరిలో అపోహాలు ఉం డటం, అత్యాశ కూడా దానికి తోడవ్వడంతో ట్రేడింగ్ మోసాలలో ఈజీగా బాధితులవుతున్నారు. ఎక్కువగా సోషల్‌మీడియాలో సైబర్‌నేరగాళ్లు ఇచ్చే ప్రకటనలు చూస్తూ అవి నిజమని నమ్ముతూ చాలా మంది సైబర్‌నేరగాళ్లు వేసే వలలో చిక్కుకుంటున్నారు.
కంపెనీ ఎవరిది, ఎక్కడి నుంచి ట్రేడింగ్ చేస్తున్నామని వెనుకా ముందు ఆలోచించకుండా సైబర్‌నేరగాళ్లు పంపించే లింక్‌లను క్లిక్ చేసి, ఆయా యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.ఇలా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లను బ్యాకెండ్ నుంచి సైబర్‌నేరగాళ్లు ఆపరేట్ చేస్తుంటారు. కండ్ల ముం దు స్కీన్ప్రై కోట్ల రూపాయలు చూపి స్తూ, అందిన కాడికి బాధితుల వద్ద నుం చి దోచేస్తున్నారు. గుర్తుతెలియని యాప్ లు, గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే ట్రేడిం గ్ చిట్కాలు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూ ప్లలో చెప్పే విషయాలు, సోషల్ మీడి యా
ప్రకటనలు నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.