సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బి గ్రేడ్ విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని తెలంగాణ బీ గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని అశోకా కాన్ఫరెన్స్ హాలులో సంఘం సమావేశాన్ని నిర్వహించి, డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ లైసెన్సింగ్ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన నేమాల బెనర్జీని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు రఘు, సయ్యద్ భాషా, మల్లేశ్ యాదవ్, ఉదయ్‌భాస్కర్, బాల్‌రెడ్డి, ఆర్.శ్రీనివాస్, గోవర్ధన్, కాళి నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.