ఖైరతాబాద్, జూన్ 19 : ఇస్కాన్ కూకట్పల్లి ఆధ్వర్యంలో మంగళవారం జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు మహా శృంగదాస తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రథయాత్ర చైర్మన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్ చైర్మన్ అంజనీ కుమార్ అగర్వాల్, కో చైర్మన్ సతీశ్ అగర్వాల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
మధ్యాహ్నం 2.34గంటలకు హైదర్‌గూడలోని మైసమ్మగూడ నుంచి రథయాత్ర ప్రారంభమై జేఎన్టీయూ, వివేకానందనగర్, హుడా ట్రక్ పార్కింగ్ మీదుగా బాలానగర్ మెట్రోస్టేషన్ వద్దకు చేరుకుంటుందన్నారు. రెండ్రోజుల ఈ ఉత్సవాల్లో భాగంగా 21న సాయంత్రం 5.30గంటలకు సికింద్రాబాద్ బాలమ్రాయ్లోని క్లాసిక్ గార్డెన్స్‌లో భక్తి, సాంస్కృతిక వేడుకలు జరుగుతాయన్నారు. కీర్తనలు, భజన్, చప్పన్ బోగ్, శ్రీనగర్దర్శన్, మహాహారతి నిర్వహిస్తామని, లక్షలాది మంది భక్తుల కోసం ప్రసాద పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.