మేడ్చల్, మే12(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోగారంలోని హోళీ మేరి కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కు ఆదివారం తరలించారు.
మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్, ఎల్బీనగర్ నియోజకవర్గాలలో పోలైన పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను పోలీసుల బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి భద్రపరిచినట్ల మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.