Ponnam Prabhakar | పెళ్లి చేస్తరా.. పంచాయతీ చేస్తరా..? మీ ఇష్టం.. బండి సాయి భగీరథ్ కేసుపై మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్)కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణకు ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటుచేసింది.
Ponnam Prabhakar | ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణకు ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటుచేసింది.
కేంద్ర మంత్రి అయి ఉండి తన కుమారుడు బాలికపై చేసిన అఘాయిత్యాన్ని చూస్తూ కుమారుడిని కాపాడుతున్న బండి సంజయ్ ని సైతం వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, అతడి కుమారుడిని అరెస్టు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
కులసంఘాలకు చెందిన ప్రతినిధులెవరో ప్రభుత్వాన్నో, కొందరు వ్యక్తులనో బద్నామ్ చేసేందుకు ప్రయత్నం చేస్తరు. ఇందులో ఎవరికి కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా ఆ కులానికి చెందింది.. కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా రాజకీయం చేసే ఆలోచనలో లేరు. అయితే కుల పెద్ద మనుషులుగా ఆ విషయాన్ని పంచాయతీ చేసి.. పెళ్లి చేస్తరా.. పంచాయతీ చేస్తరా.. ఏం చేస్తరో.. మీ ఇష్టం.. అండర్ ఏజ్ ఉన్నప్పుడు చట్టంలో ఉన్న నిబంధనలను ఏం చేస్తరో మీ ఇష్టం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
మరోవైపు బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో పోలీసులు తమ బాధ్యతలను విస్మరిస్తే వారికి కూడా శిక్ష తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
బండి సంజయ్ కొడుకు బాధితురాలు కూడా మున్నూరు కాపులే
కుల పెద్దమనుషులు పంచాయితీ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తారా ఏం చేస్తారో చేయండి
అంతేకానీ కులం పేరుతో వివక్ష చూపుతున్నాము అనడం సరికాదు
బండి సంజయ్ కొడుకు POCSO కేసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ https://t.co/eD82cByzse pic.twitter.com/Ox0Qltlizf
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026
Read Also :
Kalki 2 | ‘కల్కి 2’ కోసం భారీ ప్లాన్.. 2027లో ప్రభాస్ విశ్వరూపం ఖాయమా?
Trisha Krishnan: ప్రేమ గురించి భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన నటి త్రిష
Priyanka Chopra | విజయ్ను దేవుడిలా ఆరాధించేవారు .. తన ఫస్ట్ హీరో గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

