Polytechinc Student | శక్తి స్కీమ్‌లో పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జీవో 97 రద్దు చేయాలని అబ్దుల్లాపూర్ మెట్లో పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తోపులాటలో గాయాలైన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.
పోలీసులు నాపై లాఠీచార్జ్ చేశారు. కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా.. ఆటోను కాళ్లమీదికి ఎక్కించిర్రు. సార్ దగ్గరకు పోయి ఆటో ఎక్కింది అంటే బూతులు తిడుతున్నడు.. ఏం చేయాలె చెప్పండి.. నాకు కాలు విరిగింది.. జాయింట్ విరిగింది.. మోచేయి విరిగింది. నేను ఎవరికి చెప్పాలే. మళ్లీ పట్టుకపోయి లోపలేస్తాడట.. మేం పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. అంటూ బోరున విలపించాడు. విద్యార్థుల పట్ల పోలీసుల ప్రవర్తన ఎలా ఉందో చెబుతోంది ఈ వీడియో.
పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బూతులు తిట్టారని కంటతడి పెట్టుకున్న పాలిటెక్నిక్ విద్యార్థి
స్టూడెంట్స్ అని కూడా చూడకుండా పోలీసులు మా మీద లాఠీఛార్జ్ చేశారు
నా కాలు మీద నుంచి ఆటో పోయి ఫ్రాక్చర్ అయినా అది చూడకుండా బూతులు తిట్టారు
మళ్లీ తీసుకెళ్లి జైల్లో వేస్తామని మమ్మల్నే… https://t.co/bnuP4EF3Cq pic.twitter.com/y0H68c0IOy
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట.. ఉద్రిక్త వాతావరణం
రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జీవో 97 రద్దు చేయాలని రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు
తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి బూతులు తిట్టారని విద్యార్థుల ఆవేదన https://t.co/cwQ3pKXep7 pic.twitter.com/ezz9Pf5CL5
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026