ఆదిలాబాద్ : కల్యాణలక్ష్మి ( Kalyana Lakshmi ) , షాది ముబారక్( Shadi Mubarak ) పథకానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మహిళా పట్టణ అధ్యక్షురాలు స్వరూపరాణి ఆధ్వర్యంలో కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్యాణలక్ష్మి పేదింటికి అండగా నిలిచిందని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత బాసటగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు పథకాలను అరకొరగా అమలు చేస్తుందని ఆరోపించారు. ఈ రెండు పథకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12.71 లక్షల కుటుంబాలకు భరోసా లభించిందని వెల్లడించారు . ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో 13,146 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.
తులం బంగారం పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఫ్లోర్ లీడర్ వేనుగంటి ప్రకాష్, మెట్టు ప్రహ్లాద్,కౌన్సిలర్ రాజ్యలక్ష్మి వసంత్, పందిరి భూమన్న, బోడగం మమత, పర్వీన్, కస్తాల ప్రేమల,కరుణ, రమ ,ఉమామహేశ్వరీ, శ్రావణి, అయ్యూబ్, తదితరులు పాల్గొన్నారు.