జగద్గిరిగుట్ట, మే 29 : బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ వివరాలను వెల్లడించారు. సూరారం కాలనీ సమీపంలోని కృష్ణానగర్ నివాసి ఆనందరెడ్డి(28) జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా వైన్ షాపుల వద్ద పార్క్ చేసిన బైకులను చోరీ చేస్తున్నాడు. జగద్గిరిగుట్ట, బాచుపల్లి, రామచంద్రాపురం, మేడ్చల్, పేట్‌బషీరాబాద్ ఠాణాల పరిధిలో చోరీలు చేశాడు. సంగారెడ్డి, రాచకొండ, మెదక్ పరిధిలోని చౌటుప్పల్, శామీర్‌పేట, తూప్రాన్, గజ్వేల్, బొల్లారం, సంగారెడ్డిలో కూడా దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి వద్ద నుంచి 22 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.