హైదరాబాద్ : కూకట్పల్లిలో పేకాట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..లోధా బెల్లేజా అపార్ట్మెంట్లో పేకాటాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. నిత్యపు మురళితో పాటు 13 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.