Asha workers | కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. ఆశా వర్కర్లు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు ధర్నా చేపట్టారు. ఆందోళనలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన పోలీసుల తోపులాటలో ఓ ఆశావర్కర్ సృహ తప్పి పడిపోయింది.
తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన రూ.18 వేల జీతమే అడుగుతున్నామన్నారు.
ప్రతి చిన్నపనికి మేమే కావాలి.. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని వాపోతున్నారు. మాకు వచ్చే నెల జీతంతో కనీసం సరుకులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ధర్నా కోసం మేము పర్మిషన్ తీసుకున్నా కూడా మమ్మల్ని కుక్కలని వేసుకొని పోయినట్లు అరెస్ట్ చేస్తున్నారని ఆశావర్కర్లు కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్దకు వచ్చిన తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆశావర్కర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్
ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్దకు వచ్చిన ఆశా వర్కర్లను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/L2Yja95fVp
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు
ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్
అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డ పోలీసులు
పోలీసుల తోపులాటలో… https://t.co/pCPItl4qst pic.twitter.com/ZC71Uf1olW
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత.. పోలీసుల తోపులాటలో స్పృహతప్పి పడిపోయిన ఆశా వర్కర్
రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల ధర్నా https://t.co/VsVRG3CEJv pic.twitter.com/OKTERXkUgR
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026