CP Kothakota Srinivas Reddy | శోభాయాత్రకు పటిష్ట భద్రత.. రాజకీయ జెండాలు, ప్రసంగాలకు నో: సీపీ కొత్తకోట
శ్రీ రామ నవమి శోభాయాత్రకు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
- ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ జెండాలు, ప్రసంగాలకు చోటు లేదు
- ఊరేగింపు రూట్‌ను పరిశీలించిన నగర సీపీ
CP Kothakota Srinivas Reddy | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): శ్రీ రామ నవమి శోభాయాత్రకు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి శుక్రవారం మంగళ్‌హాట్ సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ విభాగాలు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ తదితర శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీరామ నవమి ఊరేగింపు జరిగే 6.8 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు. శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శోభాయాత్రలో రాజకీయ జెండాలు, రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, అదనపు సీపీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోన్ కమిషనర్ హేమంత్ సహదేవ్‌రావు, డీసీపీలు, ఇతర శాఖల అధికారులతో పాటు ఉత్సవ సమితి సభ్యులు భగవంతరావు, కృష్ణ, ఆనంద్ సింగ్, గోవింద్‌రాఠీ కిరోడి మాల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే శ్రీరామ నవమి వేడుకలు, శోభాయాత్ర నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి నగర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై హనుమాన్ వ్యాయమ శాల వరకు కొనసాగుతుందని, ఈ ర్యాలీకి నగరంతో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి వచ్చే ర్యాలీలు కలుస్తాయని సూచించారు. సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఎస్‌హెచ్‌వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

