బాలానగర్, మార్చి 8: కంచె చేసు మేసిన చందంగా.. కంపెనీ నగదును అక్కడడే పనిచేస్తున్న ఉద్యోగులు కాజేసేందుకు కుట్రపన్నారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకొని బాలానగర్ పోలీసులకు అప్పగించారు.
సీఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాలు.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి గిరినగర్‌లో నివాసముంటూ స్థానికంగా బాలాజీ స్టీల్ ట్రేడర్స్ కంపెనీలో పని చేస్తున్న మున్నాకుమార్ (33), కళ్లు రాయ్ (32), హరీందర్‌సింగ్ (47) శుక్రవారం సంస్థకు చెందిన నగదును కాజేసేందుకు తరలిస్తుండగా.. రూ.19లక్షల 2వేల నగదును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.