సైదాబాద్, ఆగస్టు 18 : ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటి సమీపంలో నివసించే బాలికకు మాయమాటలు ..అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఓ బస్తీలో నివాసముండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (55) తన ఇంటి పక్కనే నివసించే బాలిక (12)తో అసభ్యంగా ప్రవర్తించాడు.
బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. బాలిక తండ్రి ఓ పోలీస్ అధికారి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తుండటంతో ఆయనకు విన్నవించుకొన్నాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల అదేశాల మేరకు, నిందితుడిపై సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.