Bandi Bhageerath : పొక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ (Bandi Bhageerath) ఎట్టకేలకు లొంగిపోయాడు. కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కుకుండా తిరిగిన భగీరథ్ శనివారం సరెండరయ్యాడు.
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించడం, పోలీసుల లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో మరో దారి లేక భగీరథ్ సరెండరయ్యాడు. శనివారం అతడు తనపై కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్
కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయిన POCSO కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి XXXX కొడుకు బండి భగీరథ్
నిందితుడు లొంగిపోయే వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు pic.twitter.com/p18LuLuUkx
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026