Veeru Vulavala | పవన్ కళ్యాణ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం పురుష: (Purushaha). ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ్కి వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ మే 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వీరు వులవల చిట్‌చాట్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
నాకు పెయింటింగ్ వేయడం అలవాటు.. చిన్నప్పుడు హీరోల బొమ్మలను క్లాత్ మీద పెయింటింగ్ వేసేవాడిని. ఆ పెయింటింగ్స్‌ను అందరూ థియేటర్ల ముందు కట్టుకునేవారు. ఆ తర్వాత బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశా. ఏ పని చేసినా సరే నేను ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నా. ఆ సమయంలోనే కొత్త బంగారు లోకం టైటిల్‌ను రాసి డిజైన్ చేశా.. అలా నేను ఇప్పటికీ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తోపాటు చాలా మంది హీరోలకు కలిపి 350కుపైగా టైటిల్స్ రాసి డిజైన్ చేశానన్నాడు.
మొదట పురుష కథను ఎంతో మందికి వినిపించా. ఓ సారి కోటేశ్వర రావుదగ్గరకు ఈ కథ వెళ్లి ఆగింది. గోవింద్, కమల ప్రేమ కథ మెయిన్ పాయింట్‌గా ఈ కథ సాగుతుంది కానీ సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా ఉంటాయని ఆయనకు చెప్పా. కథ విన్న తర్వాత ఆయనకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమా అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మా అబ్బాయి బాగా రీచ్ అవుతాడని కోటేశ్వర రావు అనుకుని ఒకే చెప్పారని చెప్పుకొచ్చాడు డైరెక్టర్.
కడుపుబ్బా నవ్వడం గ్యారంటీ..
ప్రేమ కోసం ఏదైనా చేసే ఓ మంచి క్యారెక్టర్లో పవన్ కల్యాణ్ కనిపిస్తారు. ఇక సప్తగిరి, కసిరెడ్డిపాత్రలు అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఇందులో కసిరెడ్డి రాసిన డైలాగ్స్ చాలా వినోదాత్మకంగా ఉంటాయి. సినిమాలో వీటీవీ గణేశ్, అనంత శ్రీరామ్, వెన్నెల కిశోర్‌తోపాటు చాలా పాత్రలుంటాయి. ప్రతీ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి వెన్నెల కిశోర్ కిటికీ వద్దుండే ఎపిపోడ్‌కు థియేటర్లో అంతా కడుపుబ్బా నవ్వడం గ్యారంటీ. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్నాడు డైరెక్టర్ వీరు వులవల.
అవకాశాల కోసం చాలా చోట్ల తిరిగా. గౌతమ్ తిన్ననూరి ‘మళ్లీ రావా’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ చిత్రంలో ప్రతీ ఫ్రేమ్‌కు డ్రాయింగ్ వేశాను. మళ్లీ రావా గ్రాండ్ సక్సెస్ కావడంతో గౌతమ్ తిన్ననూరితో ప్రయాణం మొదలైంది. జెర్సీ సినిమాకు కూడా పనిచేశా. ఈ సినిమాకు పని చేస్తున్న టైంలోనే పురుష : పాయింట్ తట్టింది. పురుషులందు పుణ్యపురుషులు వేరియా అనే పాయింట్‌తో కథను మొదలుపెట్టానంటూ డైరెక్టర్ వీరు వులవల చెప్పుకొచ్చాడు.