Anil Menon | సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్
Anil Menon | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (NASA Austronaut) అనిల్ మీనన్ (Anil Menon) తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యా (Russia) కు చెందిన సోయజ్ MS-29 వ్యోమనౌక (Soyuz MS-29 Sapce Craft) లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఆయన సురక్షితంగా చేరుకున్నారు.
Anil Menon : భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (NASA Austronaut) అనిల్ మీనన్ (Anil Menon) తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యా (Russia) కు చెందిన సోయజ్ MS-29 వ్యోమనౌక (Soyuz MS-29 Sapce Craft) లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఆయన సురక్షితంగా చేరుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలపాటు సాగే ఈ మిషన్‌లో ఆయన కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు చేపట్టనున్నారు.
కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయజ్ MS-29 వ్యోమనౌకలో అనిల్ మీనన్, రోస్కాస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలతో కలిసి బయలుదేరారు. కేవలం మూడు గంటల ప్రయాణం తర్వాత వారి వ్యోమనౌక ఐఎస్ఎస్లోని ప్రిచల్ మాడ్యూల్తో విజయవంతంగా అనుసంధానమైంది. వీరి రాకతో అంతరిక్ష కేంద్రంలోని సిబ్బంది సంఖ్య తాత్కాలికంగా 10కి పెరిగింది. ప్రయోగానికి ముందు అనిల్ మీనన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో స్పందిస్తూ.. అమెరికా స్పేస్ ఫోర్స్ తరఫున సేవలు అందించడం, నాసా, అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుతో అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
అంతరిక్ష కేంద్రంలో ఉన్న యాత్ర-74 సిబ్బంది.. నాసా వ్యోమగాములు జెస్సికా మీర్, జాక్ హాత్వే, క్రిస్ విలియమ్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీ అడెనాట్, రోస్కాస్మోస్ వ్యోమగాములు సెర్గీ కుడ్-స్వెర్చ్కోవ్, సెర్గీ మికయేవ్, ఆండ్రీ ఫెద్యాయేవ్.. కొత్తగా వచ్చిన బృందానికి సాదర స్వాగతం పలికారు. మీనన్ బృందం ఏప్రిల్ 2027 వరకు అంతరిక్ష కేంద్రంలోనే ఉంటుంది. ఈ ఎనిమిది నెలల మిషన్‌లో అనిల్ మీనన్ పలు కీలక పరిశోధనలు చేయనున్నారు. హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలకు అవసరమైన సెమీకండక్టర్ స్ఫటికాలను అంతరిక్షంలో తయారుచేసే ప్రక్రియను మెరుగుపరచడంపై ఆయన పనిచేస్తారు.
అలాగే భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో భూమి నుంచి వైద్య సహాయం అవసరం లేకుండా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), ఏఐ పద్ధతులను ఉపయోగించి అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించడంపై దృష్టి పెడతారు. వీటితో పాటు, సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో రక్త ప్రవాహంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయనున్నారు. వృద్ధాప్య ప్రక్రియపై అవగాహన పెంచేందుకు బయోప్రింటింగ్ వాస్కులర్ కన్స్ట్రక్ట్లను కూడా పరీక్షిస్తారు. వృత్తిరీత్యా ఎమర్జెన్సీ ఫిజీషియన్ అయిన మీనన్ ప్రయోగాన్ని అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అభినందించింది.
గడిచిన 25 ఏళ్లుగా నిరంతరాయంగా మానవ నివాసానికి కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. భూమిపై సాధ్యం కాని అనేక శాస్త్రీయ పరిశోధనలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ చేసే ప్రయోగాలు వైద్యం, ఇంజినీరింగ్, బయాలజీ వంటి రంగాల్లో పురోగతికి దోహదపడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

