IPL 2026 | ఐపీఎల్ ఫైనల్కు మొహ్సిన్ నఖ్వీ.. అసలు కారణమిదే..!
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఫైనల్ రోజే మే 31న ఐసీసీ ప్రతినిధులతో ఛైర్మన్ జై షా (Jai Shah) భేటీ కానున్నారు. ఈ త్రైమాసిక సమావేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) హాజరవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.
IPL 2026 : అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశం ఈసారి భారత్లో జరుగనుంది. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఫైనల్ రోజే మే 31న ఐసీసీ ప్రతినిధులతో ఛైర్మన్ జై షా (Jai Shah) భేటీ కానున్నారు. ఈ త్రైమాసిక సమావేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) హాజరవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా బీసీసీఐపై.. భారత జట్టుపై రగిలిపోయే నఖ్వీ ఈ మీటింగ్కు వస్తాడా? అనేది ఇంకా ఖరారు కాలేదు.
ఐసీసీ కార్యాలయం దుబాయ్లో ఉన్నందున త్రైమాసిక సమావేశం దోహా, ఖతార్లో మార్చి – ఏప్రిల్ మధ్య జరగాల్సింది. కానీ, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నందున.. ఈ సమావేశం వేదికను భారత్కు మార్చారు. కొత్త షెడ్యూల్ ప్రకారం జై షా మే 21న ఐసీసీ సభ్యులతో వర్చువల్గా సమావేశం కానున్నారు. అనంతరం మే 30న లేదా మే 31న ఐపీఎల్ ఫైనల్ రోజే అహ్మదాబాద్లో షా.. వారితో భేటీ అవుతారని సమాచారం. అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ భారత్కు రావడంపై ఇంకా స్పష్టత లేదు.
🚨 MOHSIN NAQVI CAME TO INDIA IN THE IPL FINAL 2026 🚨
– According to sources, the news being received is that the BCCI has invited PCB chairman Mohsin Naqvi to India for the IPL final, and he was also invited to Ahmedabad for the board meeting.
– Mohsin Naqvi is coming to… pic.twitter.com/y4U02oppaa
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 16, 2026
ఆసియా కప్ ట్రోఫీతో పరార్
నిరుడు ఆసియా కప్ను విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకుండా పరారైన నఖ్వీ.. టీ20 ప్రపంచకప్లో టీమిండియాతో ఆడమని పెద్ద రాద్దాంతం చేశాడు. చివరకు శ్రీలంక అధ్యక్షుడి జోక్యంతో దిగొచ్చిన నఖ్వీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని భారత్కు వస్తాడు? అనేది విశ్లేషకుల మాట. ఒకవేళ.. అతడు రావాలుకున్నా అందుకు పాక్ ప్రభుత్వం అనుమతివ్వాలి. భారత ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించాలి. లేదంటే.. పాక్లోనే ఉండి వర్చువల్గా నఖ్వీ ఐసీసీ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది.
No Invite For IPL 2026 Final, Mohsin Naqvi To Attend ICC Meeting Virtuallyhttps://t.co/PST0vlcAIs
— Times Now Sports (@timesnowsports) May 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Asia Cup 2025
- ICC
- ipl 2026
- Jai Shah
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

