NAC | మాదాపూర్, జూలై 19: వృత్తి, నైపుణ్య శిక్షణలో ఉపాధి కల్పిస్తున్న న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ఆధ్వర్యంలో జనరల్ కేటగిరీ బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం 3 నెలల ప్లేస్మెంట్ లింక్డ్ పేమెంట్ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది.
ఇందులో ఎస్సీ, బీసీ-సీ వర్గానికి చెందిన బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనుంది. ఉచిత శిక్షణ, భోజన వసతి, 100 శాతం ప్లేస్మెంట్ కల్పించనున్నారు. ఈ నెల 22 న ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు న్యాక్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ తెలిపారు. శిక్షణలో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు 9505631765 గల నంబర్‌ను సంప్రదించగలరు..