సుల్తాన్‌బజార్ : మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయబడిందని, తిరిగి తెరిచేందుకు గాను మీ పాన్ కార్డు వివరాలను ఇవ్వాలని 25 వేల నగదును ఖాతాలో నుండి దోచుకున్న సంఘటన సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం కోఠి ఇసామి యా బజార్ ప్రాంతానికి చెందిన నర్సాపురం శ్రీనివాసా చారి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇ దిలా ఉండగా ఈ నెల 4న ఉదయం 11.45 నిమిషాల ప్రాంతంలో శ్రీనివాసాచారి కూతురు పూజశ్రీ మొబైల్ ఫోన్‌కి గుర్తు తెలియని మొబైల్ 918276967780తో కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఎస్ఎంఎస్ వచ్చిందన్నారు. అంతే కాకుండా అదే సమయంలో అదే నెంబర్‌తో ఫోన్లో మీ ఖాతా సస్పెండ్ అయ్యిం దని పాన్ కార్డు సమాచారం పంపితే మీ ఖాతా తిరిగి ఆక్టివేట్ అవుతుందని తెలపడంతో అవతలి వ్యక్తి ఓటీపీ వచ్చిందని అడగగానే ఓటిపి తెలపగానే ఖాతాలో ఉన్న 25 వేల నగదు పోయిందన్నారు.
డబ్బు పోగానే అదే నెంబర్‌కు కాల్ చేయగా నాట్ రీచబుల్ అని అంటుందని వాపోయారు.గత కొన్ని రోజులుగా ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేటడుతున్నారు.