సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ స్కాలర్ అంకిత కుమారి ఉత్తమ పోస్టర్ అవార్డును సొంతం చేసుకున్నది. పుణేలోని ఐఐఎస్ఈఆర్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును అందజేశారు.
18వ ఎడిషన్ సదస్సులో ఆల్కనైల్ ప్రతిచర్య, బెంజోసల్టాం ఆక్రాలమిడ్స్ అంశంపై యంగ్ రీసెర్చ్ స్కాలర్ అంకిత చేసిన పరిశోధనకు గాను ఉత్తమ పోస్టర్ అవార్డు గెలుచుకుంది. డా. సీహెచ్ రాజిరెడ్డి నేతృత్వంలో అంకిత పరిశోధన విద్యార్థిగా కొనసాగుతుంది. ఆమె ఎంపికపై ఐఐసీటీ వర్గాలు అభినందనలు తెలిపాయి.