ఈవీఎంలో ఓటరు నిర్ణయం
మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పకడ్బందీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు.
- సాయంత్రం 5 గంటల వరకు
- 54.62శాతం పోలింగ్
- మేడ్చల్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
- 3న భవితవ్యం
- ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ
- మధ్యాహ్నం వరకూ మందకోడిగా పోలింగ్
- వికలాంగులు, వృద్ధులకు చేయూత
- ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు
- పలు కేంద్రాలను సందర్శించిన మంత్రి మల్లారెడ్డి, ఇతర అభ్యర్థులు
మేడ్చల్ జోన్ బృందం, నవంబర్ 30 : మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పకడ్బందీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. ఓటర్లు క్యూలో నిల్చోని, ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాల వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చేయూతనిచ్చారు. వీల్‌చైర్‌లో తీసుకెళ్లి, నేరుగా ఓటు వేయించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు చోట్ల ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకున్నాయి.
3 గంటల తర్వాత తరలివచ్చిన ఓటర్లు
ఓటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మోస్తారుగా ఓటు వేయడానికి వచ్చారు. 5 గంటల వరకు పోలింగ్ సమయం ముగియనున్నందున 3 గంటల తర్వాత ఓటు వేయడానికి తరలివచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 7 గంటల దాటినా పోలింగ్ కొనసాగింది.
పలు కేంద్రాలను సందర్శించిన మంత్రి
మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, కీసర, నాగారంలలో పర్యటించి, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన వారు ఓటు వేయడానికి ఉత్సాహం చూపారు. పోలింగ్ రోజు ఇచ్చిన సెలవును ఆనందంగా గడపడానికి కాకుండా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా తాగునీరు, టెంట్లు తదితర సౌకర్యాలను కల్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?


