సుల్తాన్‌బజార్, నవంబర్ 13 : ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో రెండవ రోజు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గంటపాటు విధులను బహిష్కరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఉద్యో గులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాఖేశ్ సహాయ్‌కు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదేశ్కుమార్, సంయుక్త కార్యదర్శి కిరణ్ కన్నా, నాయకులు మహేందర్, సర్తాజ్లతో కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్రఇక్కట్లు పడుతున్నామని ఉద్యోగులు వాపోయారు. జీతాలు చెల్లించకపోవ డంతో విధులకు హాజరుకావాలన్నా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు వివరించారు. గత రెండేళ్ళుగా మూడు ఏజెన్సీల పరిధిలో 225 మంది ఉద్యోగులు దవాఖానలోని పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిటీ, ఎమ్మారై స్కాన్ టెక్నీషియన్లు, ఎలక్ట్రిక ల్, దోభీ ఘాట్, టెలిఫోన్ ఎక్సేంజీ, స్టాఫ్ నర్సులు, ఈఈజీ, ఈసీజీ, ఆఫీస్ సబార్డినేట్లు దవాఖానలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు రోజుకు ఒక గంటపాటు నిరసన వ్యక్త ం చేస్తామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాఖేశ్ సహాయ్ వేతనాల జాప్యం విషయమై డీఎంఈ డాక్టర్ నరేందర్‌కు మార్కు, ట్రెజరీ అధికారులకు సమాచారం అందజేయడంతోపాటు చర్చించడం జరిగిందని అన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో స్వరూప, పద్మ, మంజుల, వెంకటేశ్, సందీప్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.