పటాన్ చెరు, అక్టోబర్ 25 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలోగల సాయి దర్శన్ కాలనీలో రూ. 60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మహదేవునిపురం కాలనీలో యూజీడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
విలీన గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, యూజీడీలు, పార్కులు వీధి దీపాల ఏర్పాటుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నమని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్లు మధుసూదన్ రెడ్డి, అజయ్ రెడ్డి, ముత్తంగి పిఎసిఎస్ చైర్మన్ బిక్షపతి, సీనియర్ నాయకులు బిక్షపతి, రామచందర్, రాజన్ సింగ్, రామచంద్రారెడ్డి, బండి శంకర్, అంతి రెడ్డి, జంగారెడ్డి, నారాయణరెడ్డి, నర్సింలు, శివా రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, కాలనీల అధ్యక్షులు శంకర్ గౌడ్, వెంకట్రావు, సోమశేఖర్, రాజేందర్ సింగ్, హరి, కాలనీవాసులు పాల్గొన్నారు.