బోడుప్పల్, జూలై11: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పౌరులకు పారిశుధ్య సేవలు విస్తరించాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. వేణుగోపాల్‌రెడ్డి శానిటేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్షేత్రస్థాయి లో పర్యటించి పారిశుధ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోడుప్పల్-మల్లాపూర్ ప్రధా న రహదారికి అనుకుని ఉన్న శాంతివనం డంపిం గ్ యార్డు, డీఆర్సీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.
నగరపరిధిలో ప్రతిరోజూ 50నుంచి 52టన్నుల చెత్త సేకరణ, తరలింపులో ఎదురవుతున్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్థ్ధ్యాలను ఉపయోగించి తయారుచేసే సేంద్రియ ఎరువులపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. స్వచ్ఛ బోడుప్పల్ సాధనలో నగరప్రజలు సహకారం తప్పరిసరి అన్నారు. అనంతరం బోడుప్పల్ ప్రధాన రోడ్లను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ జాన్పాల్రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేశ్, వినోద్, అధికారులు, స్బిబంది పాల్గొన్నారు.