ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ( Sudeer Reddy) కి పద్మశాలీ సంఘం సంపూర్ణ మద్దతు (Support) ప్రకటించింది. నియోజకవర్గంలోని పద్మశాలీల(Padmashali ) తరపున ఎల్బీనగర్, గడ్డిఅన్నారం పద్మశాలీ సంఘం నాయకులు మంగళవారం సమావేశమై మద్దతు నిర్ణయాన్ని ప్రకటించారు.
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి, అన్ని సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) కు, బీఆర్ఎస్(BRS) కారు గుర్తుకు ఓటు వేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి రావాలని, ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి అఖండ విజయం సాధించాలని పద్మశాలీ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేనేత(Handloom), కార్మిక (Labour) సంఘాల అభ్యున్నతికి ఎన్నో చర్యలు తీసుకున్నారని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు చిప్ప ప్రభాకర్, బురుగు తులసీదాస్, రాపోలు సుధాకర్, ఉమా శ్రీనివాస్, రమాదేవి, సుధాకర్, చెరుకు స్వామి, రుద్ర యాదగిరి, కస్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు చేశాం..ఆశీర్వదించండీ : దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్‌నగర్ డివిజన్ సుభద్రానగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.