సికింద్రాబాద్, జూన్ 29: సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని, ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు. మంగళవారం సీతాఫల్‌మండిలోని క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ ఈఈ వెంకట్‌దాస్, ముషీరాబాద్ డిప్యూటీ తాసీల్దార్, మారేడ్‌పల్లి తాసీల్దార్ సునీల్‌తో పాటు ఇతర అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో 60, దోబీఘాట్లో 207 ఇండ్లను రూ. 26 కోట్లతో నిర్మించామన్నారు.