ఖైరతాబాద్, జనవరి 24: లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ భారీ కంటెయినర్ అదుపుతప్పి పడిపోయింది. సైఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సీఐ రాఘవేంద్ర వివరాల ప్రకారం.. మూసాపేట నుంచి కాటేదాన్‌కు ఓ భారీ కంటెయినర్ పేపర్ లోడ్‌తో బయలుదేరింది. ఉదయం లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగా అదుపు తప్పి డివైడర్‌పై పడిపోయింది.
ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో స్వల్ప అంతరాయం కలిగింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి భారీ లోడ్‌తో ఉన్న వాహనాన్ని మూడు క్రేన్ల సాయంతో తొలగించారు. వాహనం ఎడమవైపు పడిపోవడంతో అందులోని డ్రైవర్ మంగలేశ్ యాదవ్, క్లీనర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.