OU | హైదరాబాద్ : విజ్ఞాన్ యూనివర్సిటీ, వైస్ టెక్ ఎస్పీజేఐఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన వైస్ టెక్ ఇండియా పిచ్చతాన్ 2025లో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు దుమ్మురేపారు. ఆంధ్రా, తెలంగాణ ఎడిషన్ బెస్ట్ స్టార్టప్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి, కందూరి బాల హనుమంత్ సాయిరాం ల స్టార్టప్ కంపెనీ శ్రీ జిపి ఆవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండవ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు డాక్టర్ పి. నాగభూషణ్( విజ్ఞాన్ యూనివర్సిటీ వీసీ), సంతోష్ కుమార్( వైస్టెక్ SPJIMR డైరెక్టర్), డీన్, ప్రమోషన్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్, VTBI డైరెక్టర్ డాక్టర్ విజయ రాము, సీఈవో ఎస్. సందీప్, అబ్దుల్ రియాజ్(ఇంక్యుబేషన్ మేనేజర్) కలిసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
దేశ నలుమూలల నుంచి మొత్తం 160 దరఖాస్తులు రాగా, వాటిల్లోంచి 13 షార్ట్ లిస్ట్ అయ్యాయి. షార్ట్ లిస్ట్ అయిన ఈ 13 స్టార్టప్ కంపెనీల నుండి టాప్ 3ని ఎంపిక చేశారు. ఇందులో నవంబర్లో జరుగనున్న గ్రాండ్ ఫినాలేకి తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీ జీప్ అవెన్స్ మాత్రమే ఎంపిక అవ్వడం గమనార్హం.