OU | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగంలో ఈ నెల 12వ తేదీ నుంచి రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ”మ్యాపింగ్ రీజినల్ హిస్టరీస్: పవర్, ఐడెంటిటీ అండ్ కల్చర్”అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సును ఆర్ట్స్ కళాశాలలోని రూమ్ నెంబర్ 133లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సుకు కన్వీనర్‌గా హిస్టరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ బి లావణ్య, కో కన్వీనర్లుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఇందిర, డాక్టర్ పి రమేశ్‌లు వ్యవహరించనున్నారు. ఈ సదస్సుకు విద్యార్థులు, పరిశోధకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.