ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే దీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: ఉస్మానియా యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
- మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాలు
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: ఉస్మానియా యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓయూ పరిపాలనా భవనం ఎదుట ప్రారంభించిన ఈ దీక్షలకు ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై తమ పోరాట పటిమను చాటుకున్నారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందన్నారు.
తాము వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టి దాదాపు మూడు వారాలు గడుస్తున్న అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, వాటిని పరిష్కరించకపోవడంతోనే దశలవారీగా నిరసనలకు దిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని ..లేనిపక్షంలోనిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే దీక్షలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

