ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించాలని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మూడవ ఇంటర్నల్ పరీక్షలను 24వ తేదీలోగా రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు.
ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు జహంగీర్ చెప్పారు. కళాశాలల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.