ఎన్నో చారిత్రక పోరాటాలు, వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు రూ. 12 కోట్ల వ్యయంతో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. గ్రాఫిక్స్ ద్వారా వర్సిటీ చరిత్ర, ప్రముఖ ఘటనలు, ఉద్యమ ఘట్టాలు, ఇక్కడ చదివిన ప్రముఖుల వివరాలతో వందేండ్ల యూనివర్సిటీ చరిత్రను డాక్యుమెంటరీగా రూపొందించి.. ప్రదర్శించారు.
– ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 29