Osmania Hospital | సుల్తాన్ బజార్, జూన్ 1: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఉస్మానియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ తెలిపారు. ఇటీవల నగరంలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, ఫార్మా మెడికల్, మినిస్ట్రీ రియల్ నాలుగో తరగతి సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇటీవల నగరంలో కరోనా కేసు నమోదైన నే పథ్యంలో దవాఖాన వైద్యులు, నర్సింగ్, ఫారా మెడికల్, ఫార్మసి, మినిస్టీ రియల్, నాల్గవ తరగతి సిబ్బందితో అత్యవసర స మావేశం ని ర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుందంటే వ్యాపిస్తున్న వదంతుల నేపథ్యంలో కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఐసోలేషన్ వార్డులో కృత్రిమ శ్వాసను అందించేందుకు వెంటి లేటర్లు, పడకల సామర్థ్యం, సిబ్బంది, నర్సింగ్ సాంకేతిక సిబ్బంది, మందుల తదితర అంశాలపై చర్చించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వైద్య సిబ్బందికి సెలవులు పెట్టకుండా 24/7 అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ వైద్యసిబ్బందికి సూచించారు.
రెగ్యులర్, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులతో పాటు అంబులెన్స్, ఫార్మసీ విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ సూచించారు. వెంటిలేటర్ల కొరత రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అత్యవ సర పరిస్థితుల్లో చికిత్సల నిమిత్తం దవాఖానకి వచ్చే రోగులు, క్షతగాత్రులకు తక్షణమే వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని విభాగాల వైద్యులు,సిబ్బంది సమన్వయంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విపత్కర పరిస్థి తుల్లో విధులకు గైర్హాజరైనా, విధి నిర్వహణలో, వైద్యసేవలు అందించడంతో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అయన హెచ్చరించారు.