ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : తాను మరణించినా నలుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత (26) గృహిణి. ఆమె భర్త గుండ్ర యశ్వంత్ యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వారికి పది నెలల శిశు శాన్విత్ ఉన్నాడు. గత నెల 29న హరిత తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ దవాఖానలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 1న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసి జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, వారు అంగీకరించారు. ఆమె శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, కండ్లను సేకరించారు.