వెంగళరావునగర్ : అభివృద్దిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం సోమాజిగూడ డివిజన్..నాగార్జున నగర్ కాలనీ బాటా షోరూం వద్ద రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, రూ.5 లక్షల వ్యయంతో వరదనీటి పైపులైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్దితో పాటు..సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ది పనులను ప్రణాళికబద్దంగా చేపడ్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేకనే టీఆర్ఎస్ పాలన పై విమర్శలు గుప్పిస్తున్నారని..రాష్ట్రంలో జరిగే అభివృద్దిని కండ్లతో చూసి మాట్లాడాలని ప్రతిపక్షాలకు హితపు పలికారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు అప్పుఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్, సలీం తదితరులు పాల్గొన్నారు.