సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): ఓపీఎం (నల్లమందు) డ్రగ్‌ను విక్రయిస్తున్న ఓ వ్యక్తితో పాటు వినియోగదారుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన హనుమాన్ రామ్ జీడిమెట్లలో నివాసముంటూ కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్వరాష్ర్టానికి చెందిన సికింద్రాబాద్‌లో నివాసముండే చున్నిలాల్తో పరిచయం ఏర్పడింది. చున్నిలాల్కు ఓపీఎం అలవాటుంది.
దీనిని ఆసరాగా చేసుకున్న రామ్, రాజస్తాన్నో ఓపీఎం తయారు చేసి కిళ్లుతో మాట్లాడి రూ.1.18 లక్షలకు 1400 గ్రాముల ఓపీఎం తీసుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. అందులో 360 గ్రాములు చున్ని లాల్‌కు విక్రయించగా మిగతాది గౌలిగూడ ప్రాంతంలో తెలిసిన వారికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రామ్‌ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుంచి 1040 గ్రాముల ఓపీఎం, అతడిచ్చిన సమాచారంతో చున్నిలాల్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 360 గ్రాముల ఓపీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.