సిటీబ్యూరో, జులై 23 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 6.7 లక్షలు బురిడీ కొట్టించారు. నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముండే బాధితుడు అమేజాన్‌లో పనిచేస్తున్నాడు. కాగా ముకేష్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌నకు ట్రేడింగ్ అవకాశం అంటూ మెసేజ్ వచ్చింది. అయితే పేరున్న గ్రోప్లాట్ ఫామ్ పేరు వాడడంతో నిజమని నమ్మాడు. దీంతో సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు ట్రేడింగ్ ఫ్లాట్ పామ్‌కు సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు.
మొదట్లో తక్కువ మొత్తంలో స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడంతో వాటికి లాభాలొచ్చాయి. నమ్మకం కుదరడంతో దఫ దఫాలుగా రూ. 7.8 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. స్క్రీన్‌పై లాభాలు కన్పించినా వాటిని విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ట్యాక్స్‌లు చెల్లిస్తేనే డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తామంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇదంతా మోసమని బాధితుడు గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా రూ. 7.8 లక్షలు పెట్టుబడి పెట్టడంతో అందులో రూ. లక్ష రూపాయల వరకు తిరిగి వచ్చాయని, రూ. 6.79 లక్షలు మోసపోయానంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.