సిటీబ్యూరో: ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారంతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను 10 శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగా చెల్లించి, వడ్డీపై 90 శాతం మాఫీని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
ఆదివారం నాటికి దాదాపు 52 వేల మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా, జీహెచ్ఎంసీకి రూ.101 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా చివరి రోజూ మరో రూ. 10కోట్ల మేర ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.