తార్నాక ఫ్లై ఓవర్‌పై బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
Tarnaka fly over | తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక ఫ్లై ఓవర్‌పై (Tarnaka flyover) వెళ్తున్న ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక ఫ్లై ఓవర్‌పై (Tarnaka flyover) వెళ్తున్న ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని రోడ్డుపైనుంచి తొలగించిన పోలీసులు వాహనాలను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

