మంటల్లో కాలిన రెండు కార్లు
ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 18: ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్రినాక నివాసి రఘు యాదవ్ రోజువారీ మాదిరిగానే స్థానిక శివపార్వతి ఫంక్షన్ హాల్ సమీపంలో తన రెండు కార్లను ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. అయితే, ఆదివారం ఉన్నట్టుండి రెండు కార్లుకు మంటలంటుకొని కాలిపోతుండగా స్థానికులు గమనించారు.
ఆ వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారమివ్వడంతో మొగల్పుర అధికారులు స్పందించి ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఛత్రినాక ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ బోజ్యా నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటన షార్టుసర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా ఎవరైనా ఆకతాయిలు కావాలనే చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

