Hayathnagar PS | హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో (Hayathnagar PS) పేలుడు కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే గదిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో (Hayathnagar PS) పేలుడు కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే గదిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. చెత్తను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పేలడంతో రికార్డ్ రూమ్ రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో జీఎంఆర్ సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికురాలు శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్టేషన్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
కాగా, పేలుడు కారణంగా రికార్డు గదిలో ఉన్న కొన్ని కీలక డాక్యుమెంట్లు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. అయితే ఖాళీ సీసాలో గ్యాస్ పేరుకుపోవడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

