గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్గా గుర్తించారు. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

