చంపాపేట, అక్టోబర్ 9: ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని.. వీటి ఏర్పాటుతో నేరగాళ్లలో భయం పుట్టడం ఖాయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 104 కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ నిధులు రూ. 5.86 కోట్లతో ఏర్పాటు చేసిన 1080 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ టీవీల నిఘా రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ క్రాంతి క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ హాజరై సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎల్బీనగర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిత్యం నియోజకవర్గం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పరితపించే నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకి రెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్‌రెడ్డి, సుంకోజు కృష్ణమాచారి, రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, చంపాపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మహిళా విభాగం అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, స్థానిక నాయకులు తలారి సత్యప్రకాశ్, డేరంగుల శ్రీనాథ్, పలు కాలనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.