Pulse Polio | సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండో రోజు పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. ఆదివారం పోలియో బూత్‌లలో చుక్కలు వేయించని చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల మందు వేశారు.
మొదటి రోజు మూడు జిల్లాల్లో దాదాపు 90 శాతానికి పైగా చిన్నారులకు చుక్కల మందు వేసిన సిబ్బంది..రెండో రోజు మరో 20 శాతం మందికి వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు పోలియో చుక్కల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.