మల్కాజిగిరి: అల్వాల్ సర్కిల్ లోతుకుంటలోని ‘గ్రిల్ హౌస్’ హోటల్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం లోతుకుంటలోని గ్రిల్ హౌస్‌లో షవర్మ తిన్న ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ తెలిపారు.
వెంటనే హోటల్లో నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు చెప్పారు. గతం లో గ్రిల్ హౌస్‌లో షవర్మ తిని చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం హోటల్‌ను సీజ్ చేశామని వెల్లడించారు. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.