గిరిజనులెవరూ కాంగ్రెస్‌కు ఓటేయొద్దు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ల అమ్మకం బాగోతాన్ని గిరిజనం గుర్తించాలని టీపీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ భరత్ చౌహాన్ అన్నారు.
- టీపీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ భరత్ చౌహాన్
ఖైరతాబాద్, అక్టోబర్ 31: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ల అమ్మకం బాగోతాన్ని గిరిజనం గుర్తించాలని టీపీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ భరత్ చౌహాన్ అన్నారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షలకు పైగా గిరిజనుల జనాభా ఉంటే మూడు సీట్లు మాత్రమే కేటాయించారన్నారు.గిరిజనులకు కనీసం 12 శాతం సీట్లు కేటాయించాల్సి ఉందన్నారు. గోండు, ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట్ల లంబాడీలకు, లంబాడీల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గోండులకు టికెట్లు ఇచ్చి ఇరువర్గాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టాడన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లు పెంచడంతో పాటు లంబాడీలకు ఏడు అసెంబ్లీ స్థానాలను కేటాయించిందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని గిరిజనులందరూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, డాక్టర్ రవినాయక్, చంద్రశేఖర్, నాగేంద్ర, లక్పతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

