PDS | మేడ్చల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రేషన్ దుకాణాల వద్ద సన్న బియ్యం నో స్టాక్ బోర్డులు దర్శనంతో రేషన్‌కార్డుదారులు ఆందోళనకు గురువుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 5,28,881 తెలుపు రేషన్ కార్డులు ఉండగా 10,761,607 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ చెప్పినప్పటికీ సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభమైన నాలుగు రోజులకే నో స్టాక్ బోర్డుల దర్శనమిచ్చాయి.
జిల్లాలో జరుగుతున్న సన్న బియ్యం పంపిణీపై జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలను అప్పగించారు.